అజిత్ పవార్ విమాన ప్రమాదంలో అనేక పేలుళ్లు జరిగాయి.. రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు

by Ajay Maddhiboyina |

మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే ష‌ర‌ద్ ప‌వార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

అజిత్ పవార్ విమాన ప్రమాదంలో అనేక పేలుళ్లు జరిగాయి.. రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే ష‌ర‌ద్ ప‌వార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని, అప్ప‌టి వ‌ర‌కు కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు త‌న ప‌దవికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశాడు. ఈ మేర‌కు రోహిత్ ప‌వార్ పీఎం మోడీకి లేఖ రాశారు. ప్ర‌మాదానికి గురైన విమానం వీఎస్ఆర్ వెంచ‌ర్స్ సంస్థ‌కు చెందిన‌ద‌ని, ఈ సంస్థ‌తో విమాన‌యాన మంత్రికి చెందిన రాజ‌కీయ పార్టీకి మ‌ధ్య సంబంధాలు ఉన్నాయ‌ని ఆరోపించారు. దీనిపై నిష్ప‌క్ష‌పాత విచార‌ణ జ‌ర‌గాలంటే మంత్రి ప‌ద‌విలో ఉండ‌కూడ‌ద‌ని అన్నారు.

అంతేకాకుండా ప్ర‌మాదం వెనుక రాజ‌కీయ లేదా వ్యాపార‌ప‌ర‌మైన కుట్ర ఉండ‌వ‌చ్చ‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన కంపెనీని కొంద‌రు శ‌క్తివంతులు కాపాడుతున్నార‌ని అన్నారు. దీనిలో డీజీసీఏ అధికారుల ప్ర‌మేయం కూడా ఉండే అవ‌కాశం ఉంద‌ని ఆరోపించారు. కేసులో న్యాయం జ‌ర‌గాలంటే అమిత్ షా, మోడీ స్వ‌యంగా దృష్టి పెట్టాల‌ని అన్నారు. ప్ర‌మాదంపై మొదటి నుంచే బ్లాక్ బాక్స్ విషయంలో సందేహాలు వ్యక్తం చేశామ‌ని చెప్పారు. ప్రమాద సమయంలో ఒక్క పేలుడు మాత్రమే కాదు, అనేక పేలుళ్లు జరిగాయన్నారు. బ్యాగులు ఉంచే ప్రాంతంలో అదనపు పెట్రోలు కాన్లు ఉంచడం వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం ఉంద‌ని చెప్పారు.

Next Story