- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాలూ కుటుంబంలో తారాస్థాయికి విభేదాలు.. రోహిణీ ఆచార్య సంచలన వ్యాఖ్యలు
బీహార్ ఎన్నికల ఫలితాల తరవాత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆర్జేడీకి గుడ్ బై చెబుతూ కుటుంబానికి కూడా దూరంగా ఉంటానంటూ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా నేడు ఆమె వరుస ట్వీట్లు చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: బీహార్ ఎన్నికల ఫలితాల తరవాత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆర్జేడీకి గుడ్ బై చెబుతూ కుటుంబానికి కూడా దూరంగా ఉంటానంటూ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా నేడు ఆమె వరుస ట్వీట్లు చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఎక్స్ వేదికగా చేసిన పోస్టుల్లో.. ఒక కూతురుగా, ఒక సోదరిగా, ఒక తల్లిగా అవమానించడ్డానని పేర్కొన్నారు. తన సోదరుడు తేజస్వీ ఇంటి నుండి వెళ్లగొట్టాడని ఆరోపించారు. అసభ్యంగా తిట్టారని, చెప్పులతో కొట్టేందుకు సైతం ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మగౌరవం విషయంలో రాజీపడేది లేదని పేర్కొన్నారు. సత్యాన్ని విడిచిపెట్టనని అందుకే తాను అవమానాలను భరించాల్సి వచ్చిందన్నారు. ఒక కూతురు ఏడుస్తున్న తల్లిదండ్రులను, అక్కా చెల్లెళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి దండ్రులకు దూరం చేసి అనాథను చేశారన్నారు. రోహిణి లాంటి కూతురు, సోదరి ఏ ఇంటిలో కూడా ఉండకూడదని కోరుకుంటున్నానంటూ పేర్కొన్నారు. అంతే కాకుండా నీ చెడ్డ కిడ్నీని నాన్నకు దానం చేశావు.. టికెట్ తీసుకున్నాకే కిడ్నీ దానం చేశావంటూ తిట్టారని తెలిపారు.
పెళ్లైన అక్కాచెల్లెళ్లకు చెప్పేది ఒక్కటేనని ఇంట్లో అన్నాదమ్ముళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఏమైనా అయితే వారినే చూసుకోవాలని చెప్పాలన్నారు. అందరు అక్కా చెలెళ్లు, కూతుళ్లు తమ ఇళ్లు మాత్రమే చూసుకోవాలని సూచించారు. మీ పిల్లలు, భర్త, మీ పని, మీ ఇల్లు గురించి మాత్రమే ఆలోచించుకోవాలన్నారు. తాను పెద్ద పాపం చేశానని తన కుటుంబం, ముగ్గురు పిల్లల గురించి ఆలోచించుకోలేదన్నారు. కిడ్నీ ఇస్తున్నప్పుడు తన భర్త, అత్తమామల పర్మిషన్ కూడా తీసుకోలేదన్నారు. తన దేవుడైన నాన్నను కాపాడుకునేందుకు చేసిన పని ఇప్పుడు చెడ్డపని అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.






