- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rohingya: రెండు ఓడలు నీట మునిగి 427 మంది మృతి.. ఆ దేశంలో తీవ్ర విషాదం !
మయన్మార్ తీరంలో ఈ నెల 9, 10 తేదీల్లో రెండు ఓడలు మునిగిపోయి 427 మంది రోహింగ్యాలు మరణించినట్టు సమాచారం.

దిశ, నేషనల్ బ్యూరో: మయన్మార్ (Myanmar) తీరంలో ఈ నెల 9, 10 తేదీల్లో రెండు ఓడలు మునిగిపోయి 427 మంది రోహింగ్యాలు (Rohingyas) మరణించినట్టు సమాచారం. ఈ రెండు ప్రమాదాల్లో భారీగా మృతి చెంది ఉంటారని ఐక్యరాజ్యసమితికి చెందిన యూఎన్ శరణార్థి ఏజెన్సీ (UNHCR) ఆందోళన వ్యక్తం చేసింది. 267 మందితో కూడిన మొదటి నౌక మే 9న మునిగిపోయిందని, ఇందులో 66 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని తెలిపింది. అలాగే మే 10న 247 మంది రోహింగ్యాలతో వెళ్తున్న నౌక బోల్తా పడగా అందులో కేవలం 21 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని వెల్లడించింది.
ప్రమాదాలకు సంబంధించిన ఖచ్చితమైన పరిస్థితులను నిర్ధారించడానికి ఇంకా కృషి చేస్తున్నామని తెలిపింది. ఈ ఘటనను అధికారికంగా ధ్రువీకరిస్తే ఈ ఏడాది సముద్రంలో జరిగిన అత్యంత దారుణ విషాదం ఇదే అవుతుందని పేర్కొంది. కాగా, సైనిక తిరుగుబాటు వల్ల మయన్మార్‌లో దశాబ్దాలుగా రోహింగ్యాలు హింసకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే సముద్ర మార్గంలో పారిపోయేందుకు వెళ్తుండగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.






