- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Robert Vadra: త్వరలోనే రాజకీయాల్లోకి వస్తా.. రాబర్ట్ వాద్రా

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలోనే రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) స్పష్టం చేశారు. గాంధీ కుటుంబంలో సభ్యుడైనందునే కేంద్ర దర్యాప్తు సంస్థలు తనను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆరోపించారు. హర్యానాలోని భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయన బుధవారం వరుసగా రెండో రోజూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేను గాంధీ కుటుంబంలో ఒకడిని. నిరంతరం ప్రజల కోసం పోరాడతా. బీజేపీ గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంది. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడితే అంతకు రెట్టింపు బలంగా మారుతాం’ అని వ్యాఖ్యానించారు.
ప్రజలు తనను రాజకీయాల్లో చూడాలనుకుంటున్నారని కాబట్టి త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇస్తానన్నారు. 1999 నుంచి ప్రజలతో కలిసి పనిచేస్తున్నానని గుర్తు చేశారు. కాగా, 2008లో హర్యానాలో జరిగిన భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ రాబర్ట్ వాద్రాలను విచారిస్తోంది. మంగళవారం ఆయనను దాదాపు ఆరుగంటల పాటు విచారించిన ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. అలాగే బుధవారం సైతం వాద్రాను ఈడీ ప్రశ్నించింది.