- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Robert Vadra: బీజేపీకి ఆ భయమే పట్టుకుంది.. రాబర్ట్ వాద్రా

దిశ, వెబ్‌డెస్క్: హర్యానా (Haryana) భూ ఒప్పందాల్లో భాగంగా ఎంపీ ప్రియాంక గాంధీ (MP Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra)కు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీ (Sky Light Hospitality)కి సంబంధించి జరిగిన మనీ లాండరింగ్ (Money Laundering) వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ (Enforcement Directorate) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ మేరకు కేసులో రాబర్ట్ వాద్రాకు ఏప్రిల్ 8న మొదటిసారి నోటీసులు జారీ చేశారు. అయితే, ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అధికారులు మరోసారి సమన్లు పంపారు. దీంతో ఇవాళ ఆయన విచారణకు తన ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి కాలినడనక వచ్చారు.
అయితే, విచారణ అనంతరం రాబర్ట్ వాద్రా (Robert Vadra) మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల తరఫున వైపు ఉండి పోరాటం చేస్తున్న తనపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులు పంపుతున్నాయని కామెంట్ చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నాననే భయం బీజేపీ (BJP)కి పట్టుకుందని.. అందుకే తనపై ఇలా కుట్రలకు తెగబడుతున్నారని ఫైర్ అయ్యారు. గత 20 ఏళ్లలో తాను 15 సార్లు నోటీసులు అందుకున్నానని.. గంటల తరబడి విచారణలో కూర్చోబెట్టారని, అడిగిన ప్రతి దానికి ఖచ్చితమైన డాక్యుమెంట్లను కూడా అందజేశానని అన్నారు. తాజాగా గురుగ్రామ్ (Gurugram) భూముల అమ్మకంలో అవకతవకలు జరిగాయంటూ ఈడీ నోటీసులు (ED Notices) పంపండం దురదృష్టకరమని తెలిపారు. బీజేపీ పెద్దలు తనపై కుట్రలు చేస్తున్నారని.. చివరికి కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా తమకు అనుకూలంగా వాడుకుంటూ ప్రతిపక్ష నేతలను భయభ్రాంతలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి నోటీసులకు తాను భయపడే ప్రసక్తే లేదని.. అధికారులు ఎన్ని సార్లు విచారణకు పిలిచిన వస్తానని కామెంట్ చేశారు.
Also Read..
ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు షాక్.. రెండోసారి సమన్లు జారీ చేసిన ఈడీ