Robert: షికోపూర్ భూ వివాదం.. రాబర్ట్ వాద్రా సహా ఇతరులకు నోటీసులు

by B.Srinivas |

షికోపూర్ గ్రామంలో జరిగిన భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ గాంధీ సహా ఇతర నిందితులకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది.

Robert: షికోపూర్ భూ వివాదం.. రాబర్ట్ వాద్రా సహా ఇతరులకు నోటీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా గురుగ్రామ్‌లోని షికోపూర్ గ్రామంలో జరిగిన భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) సహా ఇతర నిందితులకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు ముందు కోర్టులో తమ వివరణను అందజేయాలని తెలిపింది. ఈ కేసుపై శనివారం జరిగిన విచారణ సందర్భంగా ప్రత్యేక న్యాయమూర్తి సుశాంత్ చంగోత్రా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వాదనలు విన్న తర్వాత నిందితులకు నోటీసు పంపారు. నిందితులందరికీ చార్జిషీట్ కాపీని అందించాలని ఈడీని ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 28కి వాయిదా వేశారు.

కాగా, గతంలో ఈడీ రాబర్ట్ వాద్రాపై మనీలాండరింగ్ కేసులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో ఇతర వ్యక్తులు, పలు కంపెనీల పేర్లు కూడా ఉన్నాయి. వాద్రా తన కంపెనీ స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రయివేట్ లిమిటెడ్ ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి 3.5 ఎకరాల భూమిని రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసి, దానిలో కాలనీని నిర్మించేందుకు అనుమతి పొందిన తర్వాత ఆ భూమిని రూ.58 కోట్లకు విక్రయించినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. దీంతో హర్యానా పోలీసులు 2018లో కేసు నమోదు చేశారు. తరువాత ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

Next Story