Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

by Ramesh Goud |

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం(Major Road Accident) జరిగింది.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం(Major Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం కన్నౌజ్(Kannauj) లోని ఆగ్రా-లక్నో ఎక్‌ప్రెస్ వే(Agra-Lucknow Expressway)పై ఆగి ఉన్న వాటర్ ట్యాంకర్(Water Tanker) ని డబుల్ డెక్కర్ బస్సు(Double-Decker Bus) అదుపు తప్పి ఢీ కొట్టి, బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జు నుజ్జు అవ్వడంతో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా సంభవించింది.

ప్రమాదంపై కన్నౌజ్ పోలీస్ సూపరిండెంట్ అమిత్ కుమార్ ఆనంద్(Amit Kumar Anand) మాట్లాడుతూ.. ఎక్స్ ప్రెస్ వేపై జరిగిన ప్రమాదంలో 8 మంది మరణించారని(8 People Died).. మరో 19 మందికి తీవ్ర గాయాలు(Seriously Injured) అయినట్లు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే తమ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అందించినట్లు తెలిపారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించామని, ప్రస్తుతం వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇక ప్రమాదానికి సంబంధించిన వివరాలపై ఆరా తీస్లున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.

Next Story