- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తప్పు నాది కాదు ఈసీదే.. రెండు ఓటరు కార్డులు ఇచ్చింది వాళ్లే: తేజస్వి యాదవ్
రెండు ఓటర్లు కార్డులు ఉన్న కేసులో తనదేం తప్పు లేదని, రెండు ఓటరు కార్డులు ఇచ్చింది ఈసీనే అని తేజస్వి యాదవ్ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: తనకు రెండు ఓటర్ కార్డులు ఇచ్చిన తప్పు ఎన్నికల సంఘానిదేనని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. బిహార్‌లో తాత్కాలిక ఓటరు జాబితాను విడుదల చేసినప్పుడు తన పేరు ఈ జాబితాలో లేదంటూ తేజస్వి యాదవ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తేజస్వి చూపించిన ఓటర్ నెంబరు తాము జారీ చేయలేదని, ఆ ఒరిజినల్ కార్డు పంపితే దర్యాప్తు చేస్తామని ఈసీ నోటీసు పంపింది.
ఇదే విషయంపై ఆయన్ను ప్రశ్నించగా.. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని అన్నారు. ‘ఎన్నికల సంఘం నుంచి నాకెలాంటి నోటీసులు రాలేదు. కానీ నాకు రెండు ఓటర్ నెంబరులు ఇచ్చారంటే తప్పెవరిది? వాళ్లు తప్పు చేసి నన్ను వివరణ ఇవ్వమంటే ఎలా? నేనైతే నా ఓటు ఒకే చోట వేస్తున్నా’ అని ఆయన తెలిపారు. అయితే దిఘా అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌వో) కూగా తాజాగా ఇదే కోరుతూ ఆయనకు లేఖ రాశారు. ఈఆర్‌వో నుంచి తనకు లేఖ వచ్చిందన్న యాదవ్.. తాను త్వరలోనే దీనికి సమాధానం ఇస్తానని చెప్పారు.






