- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళ ఎన్నికల బరిలో ఆర్జేడీ.. పార్టీ చీఫ్ తేజస్వీ యాదవ్ ప్రకటన
రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ తేజస్వీ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తమ పార్టీ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమితో కలిసి పోటీ చేయనుందని ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆర్జేడీ (RJD) అధినేత తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ (LDF) కూటమిలో భాగంగానే ఆర్జేడీ ఎన్నికల బరిలోకి దిగనుంది. అదేవిధంగా అక్కడ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF)కు ఆర్జేడీ మద్దతు ఇస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా తమకు కేటాయించే స్థానాల్లో పోటీ చేస్తామని తేజస్వీ స్పష్టం చేశారు. బిహార్ బయట కూడా తమ పార్టీని బలోపేతం చేసే దిశగా కేరళ ఎన్నికలను ఆర్జేడీ ఒక అవకాశంగా భావిస్తోంది. ఇప్పటికే కేరళలోని ఆర్జేడీ విభాగం ఎన్నికల సన్నద్ధతపై కసరత్తు మొదలుపెట్టింది. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా, లౌకికవాదాన్ని కాపాడేందుకు ఎల్డీఎఫ్ కూటమి చేస్తున్న పోరాటంలో తాము భాగస్వాములం అవుతామని తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు.






