- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటక కాంగ్రెస్‌లో టికెట్ల రగడ..
by Harish |
ఎన్నికల రాష్ట్రం కర్ణాటకలో టికెట్ల రగడ మొదలైంది. ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావాహుల మద్దతుదారులు పార్టీ ప్రధాన కార్యాలయంలో నిరసనలు చేపట్టారు.

X
బెంగళూరు: ఎన్నికల రాష్ట్రం కర్ణాటకలో టికెట్ల రగడ మొదలైంది. ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావాహుల మద్దతుదారులు పార్టీ ప్రధాన కార్యాలయంలో నిరసనలు చేపట్టారు. తమ ప్రియతమ నేతకే టికెట్ కేటాయించాలని నినాదాలు చేస్తూ.. ప్లకార్డులు ప్రదర్శించారు. పార్టీ చీఫ్ డీకే శివకుమార్ కార్యాలయంలోకి వెళ్లే సమయంలో నిరసనలు చేపట్టిన వీడియోలు కాస్తా వైరల్ గా మారాయి. రెండో విడత జాబితాను ప్రకటించనున్న తరుణంలో ఈ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు తమ పార్టీ ఈ ఎన్నికల్లో తప్పక గెలుస్తుందని కర్ణాటక వర్కింగ్ ప్రెసిడెంట్ సలీమ్ అహ్మద్ తెలిపారు. ఉత్తమమైన అభ్యర్థులకు టికెట్లు ఇస్తామని చెప్పారు. కాగా, గత నెల 25న కాంగ్రెస్ 124 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండో జాబితాను మంగళవారం ప్రకటించనుంది.
Next Story






