- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rishi Sunak: ముంబైలో బ్రిటన్ మాజీ ప్రధాని సందడి.. స్థానికులతో కలిసి క్రికెట్ ఆడిన రిషి సునాక్
బ్రిటన్ మాజీ ప్రధాని, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి అల్లుడు రిషిసునాక్ మహారాష్ట్రలోని ముంబైలో ప్రత్యక్షమయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్ మాజీ ప్రధాని, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునాక్ (Rishi sunak) మహారాష్ట్రలోని ముంబైలో ప్రత్యక్షమయ్యారు. దక్షిణ ముంబైలోని పార్సీ జింఖానా గ్రౌండ్ (Parsee Gymkhana)ను సందర్శించిన ఆయన స్థానికులతో కలిసి క్రికెట్ ఆడారు. పలువురు యువకులతో కలిసి తిరుగుతూ వారితో సంభాషించారు. ఈ మేరకు తన ఎక్స్ ప్లాట్ ఫాంలో దీనికి సంబంధించిన పోటోలను షేర్ చేశారు. ‘భారత పర్యటనలో చాలాసార్లు బయటకు రావడం సంతోషంగా ఉంది. ముంబై వస్తే టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడాల్సిందే. ఈ ఆట లేకుండా ముంబై పర్యటన పూర్తి కాదు’ అని పేర్కొన్నారు. ఇదొక అద్బుతమైన ఆట అని కొనియాడారు. పార్సీ జింఖానా క్లబ్ వార్షికోత్సవ వేడుకల్లో అందరితో కలిసి ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి పర్యటనల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. గతంలోనూ రిషి సునాక్ బెంగళూరులోని ఓ హోటల్‌లో సందడి చేశారు. సాధారణ వ్యక్తిలా కాఫీ తాగుతూ స్థానికులతో సెల్ఫీలు దిగుతూ గడిపారు. కాగా, ప్రతిష్టాత్మకమైన పార్సీ జింఖానాను1885 ఫిబ్రవరి 25న స్థాపించారు. దీని వ్యవస్థాపక అధ్యక్షుడు సర్ జమ్‌సెట్‌జీ జీజీబోయ్, జంషెడ్ టాటా చైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఈ క్లబ్ వార్షికోత్సవ వేడుకలు జరుపుతుండగా దానికి రిషి సునాక్ హాజరైనట్టు తెలుస్తోంది.






