- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. పలు నేరారోపణలపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై నమోదైన కేసులపై నవంబర్ 17న తీర్పు వెలువడనుంది. ఈ తీర్పు రానున్న సమయంలో దేశంలో పలు చోట్ల అల్లర్లు చెలరేగడం గమనార్హం. తీర్పు నేపథ్యంలో హసీనా పార్టీ అవామీ లీగ్ ఢాకాలో లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చింది. గత ఏడాది జరిగిన గొడవలు, రక్తపాతం దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఢాకాలో భద్రత కట్టుదిట్టం చేసింది.
మరీ ముఖ్యంగా తీర్పును వెలువరించే ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) చుట్టూ సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. పోలీసులు, బోర్డర్ గార్డ్ సెక్యూరిటీని భారీ స్థాయిలో మోహరించారు. రాజధాని నగరంలోకి ప్రవేశించే మార్గాల వద్ద పలు చెక్ పాయింట్లను ఏర్పాటు చేసి, ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.
Next Story






