మణిపూర్‌లో మళ్లీ రెచ్చిపోయిన దుండుగులు.. వారికోసం వేట ప్రారంభించిన ఆర్మీ గ్రూపులు

by Malleboina Mahesh |   (  Updated:2025-09-20 03:36:45  IST  )

రాష్ట్రపతి పాలన తర్వాత ప్రశాంతంగా ఉన్న మణిపూర్ రాష్ట్రం.. మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఎవరూ ఉహించిన విధంగా మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది.

మణిపూర్‌లో మళ్లీ రెచ్చిపోయిన దుండుగులు.. వారికోసం వేట ప్రారంభించిన ఆర్మీ గ్రూపులు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రపతి పాలన తర్వాత ప్రశాంతంగా ఉన్న మణిపూర్ రాష్ట్రం ‘(Manipur State).. మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఎవరూ ఉహించిన విధంగా మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత (Tension) చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లా నంబోల్ సమీపంలోని సబల్ లెకై ప్రాంతంలో అసోం రైఫిల్స్ కాన్వాయ్‌ (Attack on Assam Rifles convoy)పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతి (Two jawans died) చెందారు. మరో ఐదుగురు గాయపడగా, వారిని ఇంఫాల్‌లోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) ఆసుపత్రికి తరలించారు.

ఈ కాల్పుల్లో నాయబ్ సుబేదార్ శ్యామ్ గురుంగ్, రైఫిల్‌మన్ రంజిత్ సింగ్ కాశ్యప్ అనే జవాన్లు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ దాడి నేషనల్ హైవే-2పై, ఇంఫాల్ నుండి బిష్ణుపూర్ వైపు వెళ్తున్న సమయంలో చోటుచేసుకోవడం ఆందోళన కలిగించింది. ఇంఫాల్ విమానాశ్రయం నుండి కేవలం 8 కి.మీ దూరంలో ఈ దాడి జరగడం భద్రతా వ్యవస్థలపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఘటనపై ఎవరూ ఇప్పటివరకు బాధ్యత వహించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం, భద్రతా దళాలు దీనిని తీవ్రంగా ఖండించి, దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి. ఈ క్రమంలో పలు బృందాలుగా విడిపోయిన ఆర్మీ సిబ్బంది దుండగులను ఏరివేసేందుకు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అలాగే జవాన్లపై దాడులకు పాల్పడిన వారికి ఆశ్రయం, రక్షణ కల్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు.

Next Story