- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగ్లాలో అల్లర్లు.. రాక్‌స్టార్ కాన్సర్ట్‌పై దాడి!
బంగ్లాదేశ్‌లో ప్రముఖ గాయకుడు జేమ్స్ (నగర్ బావుల్ జేమ్స్) కాన్సర్ట్ భారీ ఉద్రిక్తతల మధ్య రద్దైంది.

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్‌లో ప్రముఖ గాయకుడు జేమ్స్ (నగర్ బావుల్ జేమ్స్) కాన్సర్ట్ భారీ ఉద్రిక్తతల మధ్య రద్దైంది. ఓ స్కూల్ 185వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జేమ్స్ కాన్సర్ట్ కు వేలాది మంది హాజరయ్యారు. అయితే రాత్రి 9:30 గంటలకు షో ప్రారంభం కావాల్సిన సమయంలో, గుర్తుతెలియని వ్యక్తులను లోపలికి అనుమతించకపోవడంపై ఆగ్రహంతో వేదికపైకి రాళ్లు, ఇటుకలు విసిరి భయాందోళన సృష్టించారు. విద్యార్థులు ప్రతిఘటించడంతో నిరసనకారులు వెనక్కి తగ్గినా, ఈ గందరగోళంలో 15 నుంచి 25 మంది వరకు గాయపడినట్లు సమాచారం.
పరిస్థితి అదుపు తప్పడంతో ఫరీద్‌పూర్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల సమయంలో కాన్సర్ట్‌ను రద్దు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. జేమ్స్ సురక్షితంగా వేదిక నుంచి బయటకు వెళ్లారు. పోలీసులు ఇది గుర్తు తెలియని వ్యక్తుల దాడి అని చెబుతుండగా, కొన్ని మీడియా కథనాలు ఇస్లామిస్ట్ మూకలు సాంస్కృతిక కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ దాడికి పాల్పడ్డాయని పేర్కొంటున్నాయి.






