RG Kar Case: మరణశిక్ష విధించాలని కోరుకోవట్లేదు.. ఆర్జీకర్ వైద్యురాలి తండ్రి కామెంట్స్

by Shamantha N |

ఆర్జీకర్(RG Kar Case) హత్యాచార ఘటనలో దోషిగా తేలిన సంజయ్ రాయ్ కి మరణశిక్ష విధించాలన్న పిటిషన్ పై కలకత్తా హైకోర్టులో విచారణ జరిగింది.

RG Kar Case: మరణశిక్ష విధించాలని కోరుకోవట్లేదు.. ఆర్జీకర్ వైద్యురాలి తండ్రి కామెంట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్జీకర్(RG Kar Case) హత్యాచార ఘటనలో దోషిగా తేలిన సంజయ్ రాయ్ కి మరణశిక్ష విధించాలన్న పిటిషన్ పై కలకత్తా హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, ఈ సందర్భంగానే మృతురాలి తండ్రి తరఫున న్యాయవాది గార్గి గోస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. దోషికి మరణశిక్ష విధించాలని కోరడం లేదని వెల్లడించారు. . బాధిత కుటుంబం తరఫు న్యాయవాది తన వాదన వినిపించారు. దోషికి మరణశిక్ష విధించాలని జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు కోరడం లేదని న్యాయస్థానానికి తెలిపారు. తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయినంత మాత్రాన దోషికూడా చనిపోవాలనేది తమ ఉద్దేశం కాదని వారు వెల్లడించినట్లు న్యాయవాది కోర్టుకు వివరించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దాఖలు చేసిన అప్పీళ్ల ప్రాథమిక విచారణ తర్వాత హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.

సిల్దా కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ..

గతేడాది ఆగస్టు 9 రాత్రి ఆర్జీకర్‌ ఆసుపత్రిలో పీజీ వైద్యవిద్యార్థినిపై జరిగిన హత్యాచార ఘటనలో (Kolkata Doctor Murder Case) సంజయ్ రాయ్ ని దోషిగా తేలుస్తూ కోల్ కతాలోని సిల్దా కోర్టు అతడికి జీవితఖైధు విధించింది. అయితే, ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తంచేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. దోషికి ఈ శిక్ష సరిపోదన్నారు. మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ దీదీ సర్కార్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. బెంగాల్ ప్రభుత్వంతో పాటు సీబీఐ కూడా ఇదే డిమాండ్‌తో స్థానిక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుని ఆశ్రయించింది. దీనిపైనే కోర్టులో విచారణ జరిగింది.

Next Story