కొత్త టెక్నాలజీతో రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు: భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది

by Malleboina Mahesh |

భారత దేశంలో చోటు చేసుకుంటున్న నవీన సంస్కరణలతో రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.

కొత్త టెక్నాలజీతో రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు: భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది
X

దిశ, వెబ్ డెస్క్: భారత దేశంలో చోటు చేసుకుంటున్న నవీన సంస్కరణలతో రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది (General Upendra Dwivedi) తెలిపారు. ఢిల్లీలో జరిగిన Delhi Defence Dialogue లో ఆయన మాట్లాడుతూ..“Defence Procurement Manual ఈ నెలలో విడుదలైంది. రక్షణ కొనుగోలు విధానం వేగంగా ముందుకు సాగుతోంది. డిసెంబరులో తుది రూపం దాల్చి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి రానుంది,” అని వెల్లడించారు. అలాగే తదుపరి నాలుగైదు సంవత్సరాలపాటు కీలక భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని ఆయన అంచనా వేశారు. దేశీయ R&D (Research & Development) రంగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని, లేదంటే దిగుమతులపై ఆధారపడాల్సిందేనని అన్నారు.

సైబర్, డేటా భద్రతలో ఇంకా పలు సవాళ్లు ఉన్నాయని, వాటిని ఎదుర్కొంటూ సహకారాత్మక వాతావరణం ఏర్పరచేందుకు సైన్యం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. దేశ రక్షణ రంగంలో “ఆత్మనిర్భర్త (Atmanirbharta)” లక్ష్యాన్ని సాధించేందుకు సైన్యం దృఢంగా కట్టుబడి ఉందని జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. “‘JAI’ అంటే Jointness, Atmanirbharta, Innovation ఈ మూడు సూత్రాలే భారత రక్షణ రంగం భవిష్యత్తుకు దారితీస్తాయి. మనం వినూత్నత (Innovation)ను వేగవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 2019 నుంచి ఇప్పటివరకు సుమారు ₹2.1 లక్షల కోట్లను పరిశోధన (R&D), రక్షణ కొనుగోళ్లలో పెట్టుబడిగా పెట్టామని ఆయన వెల్లడించారు. ఇది ఒక పెద్ద ప్రయత్నమని, కానీ దీని ఫలితాలు సమయం తీసుకుంటాయని తెలిపారు.

మనం ఓపికగా, దశలవారీ అభివృద్ధి (spiral development) పద్ధతిలో ముందుకు సాగుతున్నాం,” అని ద్వివేది పేర్కొన్నారు. అలాగే భారత్‌ కీలక సవాళ్ళను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వచ్చే ప్రతి సాంకేతికతను ఐదో తరం యుద్ధాల (five generations of warfare) పరిధిలో సరిపోనంతలా ఉండేలా తీర్చిదిద్దుకోవాల్సి ఉందని ఆయన వివరించారు. భద్రతా అవసరాలు పాత ట్రెంచ్ యుద్ధం నుంచి ప్రారంభించి, రోబో మ్యూల్, GS మ్యూల్ వంటి ఉపకరణాలతో కలిసి పని చేయాల్సి ఉంటుందని, తర్వాత ఇండైరెక్ట్ ఫైర్, మ్యాన్యువల్ ఫేర్, వార్‌ఫేర్, హైబ్రిడ్ వార్‌ఫేర్ నుంచి చివరికి 5-జెనరేషన్ వార్‌ఫేర్ వరకు మార్పులను ఎదుర్కోవాల్సి ఉంటుందని భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది అన్నారు.

Next Story