NTA JEE Mains: 110 మంది జేఈఈ అభ్యర్థుల ఫలితాలు నిలిపివేత.. ఎందుకంటే?

by Ramesh Naini |   (  Updated:2025-04-19 07:16:17  IST  )

దేశవ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూసిన జేఈఈ (మెయిన్‌) సెషన్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసిన సంగతి తెలిసిందే.

NTA JEE Mains: 110 మంది జేఈఈ అభ్యర్థుల ఫలితాలు నిలిపివేత.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూసిన జేఈఈ (మెయిన్‌) సెషన్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కీ విడుదల చేసి.. విద్యార్థుల పర్సంటై‌ల్ స్కోర్‌ను వెల్లడించింది. ఈ క్రమంలోనే 110 మంది అభ్యర్థులు అక్రమాలకు పాల్పడి ఫోర్జరీ సంతకాలతో ధ్రువపత్రాలు సమర్పించారని నిలుపుదల చేశారు. ఈ కారణంగా వారి ఫలితాలను నిలుపుదల చేసినట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, మొత్తం 24 మంది విద్యార్థులు 100కి వంద పర్సంటైల్‌ సాధించిన విషయం తెలిసిందే. అలాగే వంద పర్సంటైల్‌ సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల వారు ఉన్నారు. తెలంగాణకు చెందిన హర్ష గుప్తా, వంగల అజయ్‌రెడ్డి, బనిబ్రత మజీ ఉన్నారు. ఏపీ నుంచి సాయి మనోజ్ఞ ఉన్నారు. తెలంగాణకు చెందిన హర్ష ఏ గుప్తా దేశవ్యాప్తంగా ఎనిమిదో ర్యాంక్‌ని సాధించగా.. అజయ్‌రెడ్డికి ఆలిండియా 16వ ర్యాంక్‌తో పాటూ ఈడబ్ల్యూస్‌ కేటగిరిలో ఒకటో ర్యాంక్‌లో నిలిచారు. మరోవైపు సాయి మనోజ్ఞ ఆలిండియా 22వ ర్యాంక్‌, బాలికల్లో రెండో ర్యాంక్‌ సాధించింది. అలాగే బనిబత్ర మజీ ఆల్‌ఇండియా 24వ ర్యాంకు సాధించింది. ఇక, జనరల్‌ విభాగంలో 93.102, ఈడబ్ల్యూఎస్‌ 80.383, ఓబీసీ 79.431, ఎస్సీ 61.15, ఎస్టీ 47.90 పర్సంటైల్‌ స్కోర్‌ను కటాఫ్‌గా నిర్ణయించారు. ఈ స్కోర్‌కు సమానంగా, లేదా అంతకంటే ఎక్కువగా స్కోర్ కొట్టిన వారు మే 18న జరగబోయే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారు.

Next Story