Viral: ఎవడ్రా నువ్వు! భోజ్‌పురి నటి ఫోటోతో ఫేక్ రెసిడెన్స్ సర్టిఫికెట్‌.. అధికారులు షాక్

by Ramesh Naini |   (  Updated:2025-08-02 07:52:04  IST  )

రెసిడెన్స్ సర్టిఫికెట్ కోసం భోజ్‌పురి నటి మోనాలిసా ఫోటోను ఉపయోగించి ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు.

Viral: ఎవడ్రా నువ్వు! భోజ్‌పురి నటి ఫోటోతో ఫేక్ రెసిడెన్స్ సర్టిఫికెట్‌.. అధికారులు షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Residence certificate) రెసిడెన్స్ సర్టిఫికెట్ కోసం భోజ్‌పురి నటి మోనాలిసా ఫోటోను ఉపయోగించి ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ అధికారులు ఇది చూసి షాక్‌‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన అప్లికేషన్ తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. (Bihar) బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలోని మోతిహారీలో రెసిడెన్స్ సర్టిఫికెట్ కోసం ప్రముఖ భోజ్‌పురి నటి మోనాలిసా పాస్‌ఫోటోను దరఖాస్తులో అటాచ్ చేశాడు. అంతే కాకుండా దరఖాస్తుదారుని పేరు "సొనాలికా ట్రాక్టర్స్", తండ్రి పేరు "స్వరాజ్ ట్రాక్టర్", తల్లి పేరు "కార్ దేవి" అని వింతైన సమాధానాలతో ఫామ్ నింపేసి అప్లాయ్ చేసుకున్నాడు. అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ అధికారులు ఈ ఫామ్ చూసి అశ్చర్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కాగా, ఈ అప్లికేషన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎవడ్రా నువ్వు ఇంత ట్యాలెంట్‌గా ఉన్నావని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. గతంలోనూ బీహార్‌లో ఇలాంటి ఫేక్ అప్లికేషన్‌లు వెలుగు చేశాయని, ఇటీవల కుక్క ఫోటో ఉపయోగించి ‘డాగ్ బాబు’ పేరుతో ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకున్న ఘటనను నెటిజన్లు గుర్తుకు చేశారు. బీహార్ రాష్ట్రంలోనే ఇలాంటి వింతైన సంఘటనలు సాధ్యం అని నెటిజన్లు సెటైర్లు వేశారు.

Next Story