చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అవసరం: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు దేశాభివృద్ధికి అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అవసరం: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కేవలం ప్రాతినిధ్యానికే పరిమితం కాకూడదని, నిర్ణయాధికారంలోనూ వారు కీలక పాత్ర పోషించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ప్రస్తుత తరుణంలో అత్యంత అవసరమని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మన ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని, ఇది దేశ రాజకీయాల్లో సరికొత్త చైతన్యాన్ని నింపుతుందని ప్రధాని అన్నారు.

‘నారీ శక్తి వందన్ అధినియం’ మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది కేవలం ఒక చట్టం మాత్రమే కాదు, అది మహిళల హక్కులను గౌరవించే ఒక గొప్ప సంకల్పమని ఆయన అభివర్ణించారు. ఈ ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకూడదని, మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారానే ‘వికసిత భారత్’ లక్ష్యం సాకారమవుతుందని మోదీ స్పష్టం చేశారు. విద్య, ఆరోగ్యం, ఆర్థిక రంగాల్లో మహిళలు రాణిస్తున్నట్లే, చట్టసభల్లో కూడా వారి గళం బలంగా వినిపించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు.

Next Story