- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
“దేశంలో కులఆధారిత రిజర్వేషన్లు రైలు కంపార్ట్ మెంట్లలా మారాయి” అని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ బోగీల్లోకి ప్రవేశించిన వ్యక్తులు ఇతరులను లోపలికి రానివ్వరని పేర్కొంది.

దిశ, నేషనల్ బ్యూరో: “దేశంలో కులఆధారిత రిజర్వేషన్లు రైలు కంపార్ట్ మెంట్లలా మారాయి” అని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ బోగీల్లోకి ప్రవేశించిన వ్యక్తులు ఇతరులను లోపలికి రానివ్వరని పేర్కొంది. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్ విచారణలో భాగంగా సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈవిధంగా స్పందించారు. ‘‘దేశంలో రిజర్వేషన్లు రైలు కంపార్ట్‌మెంట్లలా మారాయి. అందులోకి ప్రవేశించిన వ్యక్తులు ఇతరులను లోపలికి రానివ్వరు. అయితే ప్రభుత్వాలు మరిన్ని వెనకబడిన వర్గాలను గుర్తించాలి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వ్యక్తులు ఉన్నారు. వారు రిజర్వేషన్ ప్రయోజనం ఎందుకు పొందకూడదు..? కొన్ని కుటుంబాలు, సమూహాలు మాత్రమే రిజర్వేషన్లపై లబ్ధి పొందుతున్నాయి’’ అని ఆయన అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు..
కాగా.. మహారాష్ట్రలో 2016-17లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఓబీసీ కోటా విషయంలో జరుగుతున్న న్యాయపోరాటంలో ఎన్నికల నిర్వహణలో ఆలస్యమైంది. దీంతో, ఓబీసీలకు 27 శాతం కోటాను అమలుచేయడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను 2021లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా.. ఈ అంశంపైనే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మరోవైపు, ఓబీసీలకు సంబంధించిన డేటా ఉన్నప్పటికీ, దాన్ని ప్రభుత్వం ఉపయోగించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన అధికారుల ద్వారా స్థానిక సంస్థలను ఏకపక్షంగా నడుపుతోందని ఆరోపించారు. రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందేందుకు ఓబీసీలలోనే వెనకబడిన వారిని గుర్తించాలని మరో న్యాయవాది తన వాదనను వినిపించారు.






