- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్-అమెరికా యుద్ధం.. ప్రత్యేక విమానాల్లో భారతీయుల తరలింపు
పశ్చిమాసియా యుద్ధం కారణంగా చిక్కుకుపోయిన భారతీయులను ప్రభుత్వం స్వదేశానికి తరలిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. దీంతో పౌరవిమానయాన రంగంలో తీవ్ర అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా పలు దేశాల్లో విమానాశ్రయాలు మూతపడటంతో వేలాంది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. దీంతో ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ఇవాళ సురక్షితంగా వెనక్కి తీసుకువస్తున్నారు. ఎయిర్ ఇండియా దుబాయ్, అబుదాబి నుండి రెస్క్యూ విమానాలను ఇవాళ నడిపింది. రెండు విమానాలు ఇవాళ ఢిల్లీకి సురక్షితంగా చేరుకున్నారి. ఈ రెండు విమానాలలో 149 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. క్షేమంగా భారత్ లో అడుగుపెట్టడం పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ సోమవారం 357 అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. ఈ సర్వీసులు ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నైల నుంచి నడవాల్సి ఉంది. సౌదీలో చిక్కుకున్న భారతీయుల్ని సురక్షితంగా స్వదేశం చేర్చేందుకు ఇండిగో సంస్థ మంగళవారం 10 ప్రత్యేక విమానాలు నడపనుంది. ఈ ప్రత్యేక విమానాలు జెడ్డా నుంచి హైదరాబాద్, ముంబయి, అహ్మదాబాద్ నగరాలకు ప్రయాణికుల్ని తీసుకురానున్నాయి.






