- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీంలోకి తొలిసారి జాగిలాలు
ఎన్డీఆర్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లోకి తొలిసారిగా జాగిలాలను ప్రవేశపెట్టనున్నారు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో

దిశ, వెబ్ డెస్క్: ఎన్డీఆర్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లోకి తొలిసారిగా జాగిలాలను ప్రవేశపెట్టనున్నారు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో డెడ్ బాడీలను గుర్తించడానికి, డెడ్ బాడీల అవశేషాలను గుర్తించడం కోసం జాగిలాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ ఇవ్వడం కోసం డెడ్ బాడీల వాసనను పోలి ఉండే ప్రత్యేకమైన సెంట్ ను విదేశాల నుండి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది.
అంతే కాకుండా బెల్జియం మాలినోయిస్, లాబ్రడార్ జాతుల శునకాలకు ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు చెప్పారు. త్వరలోనే ఫస్ట్ బ్యాచ్ విధుల్లోకి వస్తుందని తెలిపారు. చాలా ప్రమాదాలలో డెడ్ బాడీలను గుర్తించడం ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కష్టంగా మారుతోంది. విపత్తుల సమయంలో మృతదేహాలు గుర్తుపట్టరాకుండా మారిపోతుంటాయి. అంతే కాకుండా శిథిలాల కింద ఉండిపోతాయి. కాబట్టి అలాంటి సమయంలో జాగిలాలను ఉపయోగించడం మంచిదని భావిస్తున్నారు.






