- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెహల్గాం ఉగ్రదాడిపై నివేదిక సిద్ధం.. మొత్తం 3 వేల మందిని విచారించిన NIA
జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack)కి సంబంధించిన నివేదికను NIA అధికారులు సిద్ధం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack)కి సంబంధించిన నివేదికను NIA అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటివరకు దాదాపు 3 వేల మందిని విచారించగా, వందకు పైగా ప్రాంతాల్లో బలగాలు సోదాలు జరిపాయి. మొత్తం 90 మంది ఓవర్‌గ్రౌండ్ వర్కర్లపై కేసులు నమోదు చేశారు. ఉగ్రదాడికి సంబంధించిన ఈ సమగ్ర నివేదికను రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు NIA డీజీ సమర్పించనున్నారు. కాగా, జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశం మొత్తాన్ని ఒక్కసారిగా కలిచివేసింది. ఉగ్రదాడిలో మొత్తం 28 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంపై దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకున్నది. పరస్పరం రెండు దేశాలు ఆంక్షలు విధించుకుంటున్నాయి. మరోవైపు.. ఉగ్రదాడికి పాల్పడిన వారిని, వారికి సహకరించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచంలో వారు ఎక్కడ దాక్కున్నా ఇండియాకు తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.






