- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jyoti Malhotra : గూఢచార్యం కేసులో కీలక పరిణామం.. జ్యోతి మల్హోత్రాకు రిమాండ్
దాయాది పాక్‌కు గూఢచార్యం (Espionage) చేస్తుందనే ఆరోపణ నేపథ్యంలో ఇటీవలే అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra)ను ఇవాళ హిస్సార్ పోలీసులు (Hissar Police) ఆమెను జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: దాయాది పాక్‌కు గూఢచార్యం (Espionage) చేస్తుందనే ఆరోపణ నేపథ్యంలో ఇటీవలే అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra)ను ఇవాళ హిస్సార్ పోలీసులు (Hissar Police) ఆమెను జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో భాగంగా నిందితురాలు జ్యోతి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (PIOs)తో సంప్రదింపులు జరిపానంటూ ఒప్పుకుందని బెంచ్‌కు పోలీసుల తరఫు న్యాయవాది తెలిపారు. అదేవిధంగా ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో పాక్ ఆధికారులు ఆమెతో ఎవరికి అనుమానం రాకుండా సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాంలలో చాట్ చేశారని.. భారత్‌లో బ్లాకౌట్ (Blackout) సమాచారాన్ని శత్రు దేశ నిఘావర్గాలకు చేరవేసిందని పేర్కొన్నారు.
ఇప్పటికే నిందితురాలి నుంచి మూడు మొబైల్ ఫోన్లు, ఓ ల్యాప్‌టాప్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. అయితే, కేసులో మరిన్ని వివరాలు, కీలక ఆధారాలు రాబట్టాల్సి ఉందని, అందుకే నిందితురాలిని కస్టడీకి ఇవ్వాలని పోలీసుల తరఫు న్యాయవాది మెజిస్ట్రేట్‌కు వివరించారు. పూర్తి వాదనలు విన్న హిస్సార్ జిల్లా కోర్టు నిందితురాలు జ్యోతికి 4 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు ఆమెను హిస్సార్ సెంట్రల్ జైలుకు తరలించారు.
అలాంటి ఆధారాలు లభించలేదు.. హిస్సార్ ఎస్పీ
ఉగ్రవాద కార్యకలాపాలు.. ఆ గ్రూపులతో జ్యోతి మల్హోత్రాకు సంబంధాలు ఉన్నట్లుగా ఆధారాలు లభించలేదని హిస్సార్ ఎస్పీ స్పష్టం చేశారు. అదేవిధంగా ఆమెకు భద్రతా దళాల గురించి ఎలాంటి అవగాహన లేదనే విచారణలో వెల్లడైందని అన్నారు. పాక్ నిఘా వర్గాలకు చెందిన వ్యక్తిని జ్యోతి వివాహం చేసుకోవాలని లేదా మతం మార్చాలని అనుకున్నట్లుగా ఆమె వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లభించలేదని ఎస్పీ తెలిపారు.






