- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జపాన్ ప్రధానిపై దాడిని ఖండించిన ప్రధాని మోడీ
by Vinod kumar |
జపాన్ ప్రధాని ఫుమియో కిషిండాపై దాడిని ప్రధాని మోడీ ఖండించారు.

X
న్యూఢిల్లీ: జపాన్ ప్రధాని ఫుమియో కిషిండాపై దాడిని ప్రధాని మోడీ ఖండించారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు శుక్రవారం ట్వీట్ చేశారు. భారత్ ఎల్లవేళలా హింసను ఖండిస్తుందని పేర్కొన్నారు. కాగా, శనివారం ఓ ప్రచార కార్యక్రమానికి సమీపంలో బాంబు పేలుడు చోటు చేసుకుంది. అయితే కిషిండా అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే ఈ దాడి జరగడంతో ప్రాణప్రాయం తప్పింది.
అప్రమత్తమైన సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గతేడాది మాజీ ప్రధాని షింజో అబే కూడా ప్రసంగ కార్యక్రమంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా దాడి భద్రతపై సందేహాలను లేవనెత్తింది. మరోవైపు వచ్చే నెలలో హిరోషిమా వేదికగా జీ7 సమావేశం జరగనుంది.
Next Story






