- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Reliance Infra: 155ఎంఎం ఆర్టిలరీ షెల్స్ అభివృద్ధి చేసిన తొలి ప్రైవేట్ కంపెనీ రిలయన్స్ ఇన్‌ఫ్రా
నేలపై జరిగే యుద్ధాలకు ఇలాంటి దీర్ఘ-శ్రేణి ఆర్టిలరీలు కీలకం.

దిశ, నేషనల్ బ్యూరో: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తదుపరి జనరేషన్ 155ఎంఎం ఆర్టిలరీ మందుగుండును విజయవంతంగా రూపొందించి అభివృద్ధి చేసిన మొదటి భారతీయ ప్రైవేట్ రంగ కంపెనీగా నిలిచింది. దీని ద్వారా రిలయన్స్ ఇన్‌ఫ్రా కీలక మైలురాయిని సాధించింది. నేలపై జరిగే యుద్ధాలకు ఇలాంటి దీర్ఘ-శ్రేణి ఆర్టిలరీలు కీలకం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ యొక్క ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏఆర్‌డీఈ), పూణేతో డిజైన్-కమ్-ప్రొడక్షన్ పార్టనర్ (డీసీపీపీ) ఒప్పందం కింద దీన్ని అభివృద్ధి చేశారు. 'మేక్ ఇన్ ఇండియా' కింద భారత రక్షణ రంగం స్వదేశీ తయారీలో భాగంగా ఇది సాధ్యమైంది. రిలయన్స్ ఇన్‌ఫ్రా పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నాలుగు రకాల 155ఎంఎం షెల్స్‌ను అభివృద్ధి చేసింది. డెవలప్‌మెంట్ పనులు పూర్తయ్యాయని, కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. పది దేశీయ సంస్థలు ఇప్పటికే సరఫరా పనిలో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. కాగా, రిలయన్స్ ఇన్‌ఫ్రా రాబోయే దశాబ్దంలో రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రూ. 10,000 కోట్ల వ్యాపార అవకాశాలను సాధించాలని లక్ష్యంగా ఉంది. ఇది కాకుండా ఈ ఆయుధాలను స్నేహపూర్వక ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. తద్వారా 10 ఏళ్లలో మరో రూ. 10,000 కోట్ల ఎగుమతి ఆదాయం పొందాలని భావిస్తోంది.






