- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర ప్రభుత్వంతో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ రూ.40,000 కోట్ల అవగాహన ఒప్పందం..?
భారత ప్రభుత్వంతో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL) భారత కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ₹40,000 కోట్ల మౌలిక ఒప్పందం (MoU)పై సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రభుత్వంతో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL) భారత కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ₹40,000 కోట్ల మౌలిక ఒప్పందం (MoU)పై సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఒప్పందానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏమి వెలువడలేదు. కానీ ఈ ఒప్పందం ద్వారా దేశవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. RCPL ఈ ప్రాజెక్ట్‌లో ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్, రోబోటిక్స్, సుస్థిర సాంకేతికతలను వినియోగించి, ఆహార ఉత్పత్తుల తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచాలని భావిస్తోంది.
ఒప్పందంలో భాగంగా RCPL ప్రత్యేకంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెట్టుబడులను పెంచి, ₹1,500 కోట్లకు పైగా వ్యయం చేసి ఫుడ్ పార్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో కర్నూల్ జిల్లాలో ₹768 కోట్లతో మొదటి ఫుడ్ పార్క్ ఏర్పాటుకు ప్రణాళికలు అమలు అయ్యాయి. ఈ పార్క్‌ల ద్వారా గుమ్మడికాయలు, నూడుల్స్ వంటి ఉత్పత్తులను దేశీయ, విదేశీ మార్కెట్ల కోసం తయారు చేయడం, తక్కువ వ్యయంతో, సమర్ధవంతమైన విధంగా ప్రాసెసింగ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ అమలయితే.. భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి కొత్త బాటలు సిద్ధం అవుతాయి. అలాగే ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా “ఆత్మనిర్భర భారత్” అభివృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారు.






