- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ponmudy : మంత్రిపై కేసు నమోదు చేయండి : ప్రభుత్వానికి హైకోర్ట్ వార్నింగ్
తమిళనాడు(Tamilanadu)లో ఓ మంత్రిపై హైకోర్ట్(Madras High Court) సీరియస్ అయింది.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు(Tamilanadu)లో ఓ మంత్రిపై హైకోర్ట్(Madras High Court) సీరియస్ అయింది. తక్షణమే ఆయనపై కేసు నమోదు చేయాలని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. తమిళనాడు డీఎంకే మంత్రి పొన్ముడి(Ponmudy) ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఓ సెక్స్ వర్కర్ తన వద్దకు వచ్చి మీరు శైవులా, వైష్ణవులా అని అడిగిందంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మంత్రి వ్యాఖ్యలను మద్రాసు హైకోర్ట్ తీవ్రంగా పరిగణించింది. తక్షణమే మంత్రిపై కేసు నమోదు చేయాలని, లేదంటే కోర్టు ధిక్కార చర్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. అనంతరం ఈ కేసును ఈనెల 23 కి వాయిదా వేసింది ధర్మాసనం. కాగా మంత్రి వ్యాఖ్యలపై తమిళనాట తీవ్ర దుమారం రేగింది. సొంత పార్టీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేయగా.. అదే రోజు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆయనను పార్టీ పదవుల నుంచి తొలగించారు.






