Mount Everest: ఎవరెస్టు నుంచి దిగుతూ భారతీయ పర్వతారోహకుడు మృతి

by Shamantha N |

భార‌తీయ ప‌ర్వ‌తారోహ‌కుడు సుబ్ర‌తా ఘోష్‌.. మౌంట్ ఎవ‌రెస్ట్ శిఖ‌రం(Mount Everest) నుంచి దిగుతూ ప్రాణాలు విడిచాడు. ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని అధిరోహించిన త‌ర్వాత‌.. కింద‌కు దిగుతున్న స‌మ‌యంలో అత‌ను చనిపోయినట్లు సమాచారం.

Mount Everest: ఎవరెస్టు నుంచి దిగుతూ భారతీయ పర్వతారోహకుడు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: భార‌తీయ ప‌ర్వ‌తారోహ‌కుడు సుబ్ర‌తా ఘోష్‌.. మౌంట్ ఎవ‌రెస్ట్ శిఖ‌రం(Mount Everest) నుంచి దిగుతూ ప్రాణాలు విడిచాడు. ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని అధిరోహించిన త‌ర్వాత‌.. కింద‌కు దిగుతున్న స‌మ‌యంలో అత‌ను చనిపోయినట్లు సమాచారం. 45 ఏళ్ల సుబ్రతా ఘోష్ బెంగాల్ లో టీచ‌ర్‌గా చేస్తున్నాడు. 8849 మీట‌ర్ల ఎత్తైన ఎవ‌రెస్టు ఎక్కిన త‌ర్వాత కిందకు దిగుతున్న స‌మ‌యంలో హిల్ల‌రీ స్టెప్ వ‌ద్ద అత‌ను ప్రాణాలు కోల్పోయాడు. హిల్ల‌రీ స్టెప్ ప్రాంతం డెత్ జోన్‌లో ఉన్న‌ది. 8వేల మీట‌ర్ల ఎత్తు నుంచి ఎవ‌రెస్ట్‌పై డెత్ జోన్‌గా ప‌రిగ‌ణిస్తారు. అక్క‌డ ఆక్సిజ‌న్ స్థాయి తక్కువగా అందుబాట‌లో ఉంటుంది. అయితే, పోస్టుమార్టం తర్వాత సుబ్రతా మృతికి గల కారణం తెలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. సుబ్ర‌తా ఘోష్ తో పాటు పిల‌ప్పీన్స్‌కు చెందిన 45 ఏళ్ల పిలిప్ శాంటియాగో సౌత్ క‌ల్న‌ల్ వ‌ద్ద ప్రాణాలు కోల్పోయాడు. అత‌ను ఎవ‌రెస్ట్‌ను ఎక్కే స‌మ‌యంలో మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు తెలిపారు. ఫోర్త్ హై క్యాంప్ చేరుకున్న త‌ర్వాత అక్క‌డ టెంట్‌లో రెస్టు తీసుకుంటూనే తుది శ్వాస విడిచాడు. మరోవైపు, నేపాల్ ప్ర‌భుత్వం ఈసారి ఎవ‌రెస్ట్ అధిరోహ‌ణ‌కు 459 మందికి ప‌ర్మిట్లు జారీ చేసింది. ఇప్ప‌టికే వంద మందికిపై ప‌ర్వ‌తారోహ‌కులు, గైడ్లు..ప‌ర్వ‌త ప్రాంతానికి చేరుకున్నారు. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటైన నేపాల్‌కు పర్వతారోహణ, ట్రెక్కింగ్ , పర్యాటకం ఆదాయ, ఉపాధి వనరు. కాగా.. గ‌డిచిన వందేళ్ల‌లో మౌంట్ ఎవ‌రెస్ట్‌పై 345 మంది మ‌ర‌ణించారు.

Next Story