- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NH-45 పై రెడ్ మార్క్స్.. ఎందుకంటే?
by Muthe.Rajitha |
మధ్యప్రదేశ్ గుండా వెళ్తున్న నేషనల్ హైవే NH-45పై రెడ్ మార్క్స్ వేశారు అటవీ అధికారులు.

X
దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ గుండా వెళ్తున్న నేషనల్ హైవే NH-45పై రెడ్ మార్క్స్ వేశారు అటవీ అధికారులు. మధ్యప్రదేశ్‌లోని వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ మీదుగా వెళ్లే జాతీయ రహదారి NH-45పై ప్రయాణించే వాహనాల నుంచి అడవిజంతువులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రహదారిపై 5 మిల్లీమీటర్ల మందంతో ఎరుపు రంగు ‘రెడ్ టేబుల్ టాప్’ మార్కింగ్స్‌ను వేశారు. ఇవి చాలా స్పష్టంగా కనిపించడం వల్ల డ్రైవర్లు అప్రమత్తమై వాహనాల వేగాన్ని తగ్గిస్తారని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. అడవి ప్రాంతాల్లో జరిగే రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ చర్య ప్రధాన ఉద్దేశమని, దేశంలో జాతీయ రహదారిపై ఈ తరహా మార్కింగ్స్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొన్నారు.
Next Story






