ఢిల్లీకి రెడ్ అలర్ట్

by Muthe.Rajitha |

దట్టమైన పొగమంచు కారణంగా దేశ రాజధాని ఢిల్లీ నగరానికి వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఢిల్లీకి రెడ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : దట్టమైన పొగమంచు కారణంగా దేశ రాజధాని ఢిల్లీ నగరానికి వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. డిసెంబర్‌ 28 అర్ధరాత్రి నుంచి పరిస్థితులు మరింత దిగజారి పోవడం,నేటి ఉదయం కూడా పరిస్థితి అలాగే ఉండటం వలన IMD ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ ప్రాంతం మొత్తం దట్టమైన నుంచి అత్యంత దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉండగా, కొన్ని ప్రాంతాల్లో విజిబిలిటీ 50 మీటర్లకంటే కూడా తక్కువగా నమోదయింది. ఈ నేపథ్యంలో IMD ఢిల్లీతోపాటు ఉత్తర భారతంలోని ఇతర ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పొగమంచు ప్రభావంతో రోడ్డు, రైలు, విమాన రవాణా తీవ్రంగా ప్రభావితమైంది.

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో CAT–III పరిస్థితులు అమలులో ఉండటంతో అనేక విమానాలు ఆలస్యమవ్వగా, కొన్ని రద్దయ్యాయి; గోవా నుంచి దిల్లీకి వచ్చే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం అహ్మదాబాద్‌కు మళ్లించారు. ఇండిగో, స్పైస్‌జెట్‌, ఎయిర్ ఇండియా వంటి విమానయాన సంస్థలు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేసి, ప్రయాణికులు ఫ్లైట్ స్టేటస్ ముందుగా చెక్ చేసుకోవాలని సూచించాయి. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, రోడ్లపై ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. ఈ పరిస్థితి డిసెంబర్‌ చివరి వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.

Next Story