- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Davos Conference : దావోస్ సదస్సులో సెక్స్ కోసం రికార్డు పెట్టుబడులు!
ఆ నగరం పారిశ్రామిక పెట్టుబడుల(Industrial Investments)కే కాదు...సెక్స్(SEX Investments) కోసం పెట్టుబడులలోనూ కొత్త రికార్డు(New Records)లకు వేదికైంది. స్విట్జర్లాండ్ లోని దావోస్(Davos)లో ఏటా నిర్వహించే ప్రపంచ పారిశ్రామిక సదస్సు(WEF)ను విదేశీ పెట్టుబడుల సమీకరణకు ప్రపంచ దేశాలు..మన దేశంలోని రాష్ట్రాలు గొప్ప అవకాశంగా భావిస్తాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఆ నగరం పారిశ్రామిక పెట్టుబడుల(Industrial Investments)కే కాదు...సెక్స్(SEX Investments) కోసం పెట్టుబడులలోనూ కొత్త రికార్డు(New Records)లకు వేదికైంది. స్విట్జర్లాండ్ లోని దావోస్(Davos)లో ఏటా నిర్వహించే ప్రపంచ పారిశ్రామిక సదస్సు(WEF)ను విదేశీ పెట్టుబడుల సమీకరణకు ప్రపంచ దేశాలు..మన దేశంలోని రాష్ట్రాలు గొప్ప అవకాశంగా భావిస్తాయి. ఈ ఏడాది కూడా దావోస్‌లో ఈ నెల 20 నుంచి 24 వరకూ ఐదు రోజుల పాటు జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సుకు పలు దేశాలతో పాటు భారత్ లోని పలు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికార ప్రముఖులు, బడా పారిశ్రామికవేత్తలు దాదాపు 3వేల మందికి పైగా హాజరయ్యారు.
ప్రధానంగా వాతావరణ మార్పులు, నాలుగో పారిశ్రామిక విప్లవం, ప్రపంచ భద్రతతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ అనేవి కీలక అంశాల నేపథ్యంలో పారిశ్రామిక పెట్టుబడులపై కీలక ఒప్పందాలు సాగాయి. దావోస్ డబ్ల్యూఈఎఫ్ సదస్సు ద్వారా పెట్టుబడుల సమీకరణ లక్ష్య సాధనలో ఎవరెవరు ఎంత మేరకు విదేశీ పెట్టుబడులు సాధించారన్న సంగతి పక్కన పెడితే...సదస్సు జరిగిన ఆ ఐదు రోజులు మాత్రం నగరంలో సెక్స్ బిజినెస్ టాప్ కు చేరిందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.
దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆ ఐదు రోజులు జోరుగా సెక్స్ పార్టీలు సాగాయని.. అమ్మాయిల బుకింగ్స్ లో కొత్త రికార్డ్స్ నమోదయ్యాయని బ్రిటీష్ మీడియా డైలీ మెయిల్ ఓ సంచలన విషయం తెరపైకి తెచ్చింది. సదస్సు జరిగిన ఐదు రోజులు సెక్స్ పార్టీలు జోరుగా జరిగాయని.. లైంగికపరమైన సర్వీసులను అందించే ఎస్కార్ట్ ఏజెన్సీలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని.. వీటితో పాటు లింగమార్పిడి మహిళల వద్దకు వెళ్లిన వారి సంఖ్య బాగా పెరిగిందని ఆ పత్రిక తన వార్త కథనంలో పేర్కొంది.
ఒకేసారి చాలా మంది అమ్మాయిలను బుక్ చేసుకుని ఎంజాయ్ చేశారని.. డబ్ల్యూఈఎఫ్ సదస్సు జరిగిన 5 రోజుల్లో కేవలం 90 మంది కస్టమర్లు 300 మంది అమ్మాయిలను బుక్ చేసుకున్నారని డైలీమెయిల్ తెలిపింది. గత ఏడాది 170 మందినే బుక్ చేసుకుంటే.. ఈ సారి ఏకంగా 300 మందిని బుక్ చేసుకున్నారని వెల్లడించింది. కొంతమంది మహిళలు ఒకే బుకింగ్ లో సుమారు 6,000 పౌండ్లు (రు.6.5 లక్షలు) సంపాదించారని.. ఈ బుకింగ్ వ్యవధి 4 గంటలని.. సదస్సు ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం బుకింగ్స్ లో ఈసారి ఏజెన్సీలు అన్నీ కలిపి సుమారు 9.68 కోట్ల రూపాయలు సంపాదించి ఉండొచ్చని అంచనా వేశారు.






