- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'SIR' అంశంపై చర్చకు సిద్ధం.. అఖిలపక్ష సమావేశం తర్వాత కిరణ్ రిజిజు వ్యాఖ్యలు
భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభమవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 36 పార్టీలకు చెందిన 50 మంది నేతలు హాజరయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Winter Sessions of Parliament) డిసెంబర్ 1 నుంచి ప్రారంభమవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు అఖిలపక్ష సమావేశం (All-party meeting) నిర్వహించారు. ఈ సమావేశంలో 36 పార్టీలకు చెందిన 50 మంది నేతలు హాజరయ్యారు. ఈ ఆల్ పార్టీ మీటింగ్ ముగిసిన తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Minister Kiren Rijiju) ప్రతిపక్షాలకు కీలక విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సజావుగా పనిచేయడానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. "పార్లమెంట్ పని చేయకుండా అడ్డుకుంటామని ఎవరూ అనలేదని.. కొంతమంది నాయకులు 'SIR' (ప్రత్యేక సమగ్ర సవరణ) అంశంపై సభలో గందరగోళం సృష్టించే అవకాశం ఉందని చెప్పారు," ఈ అంశాలన్ని తాను సానుకూల దృక్పథంతోనే చూస్తున్నానని, ప్రతిపక్షం లేవనెత్తే అంశాన్ని వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
అలాగే సభలో ఏ అంశంపై చర్చించాలన్నా ఒక పద్ధతి ఉంటుంది. దానికి నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి," అని రిజిజు గుర్తు చేశారు. పార్లమెంటరీ నియమాలను అనుసరించి ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. దీని ద్వారా SIR అంశంపై ప్రతిపక్షాల ఆందోళనను చర్చ ద్వారా పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
కాగా ఈ శీతాకాల సమావేశాలు సుమారు మూడు వారాల పాటు డిసెంబర్ 19 వరకు జరగనున్నాయి. అంటే డిసెంబర్ 1 నుంచి 19 శుక్రవారం వరకు జరగనున్నాయి. ఈ స్వల్ప కాలంలోనే కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలకమైన బిల్లులను ఆమోదించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం 15 సిట్టింగ్‌లకు ఈ సమావేశాలను షెడ్యూల్ చేశారు. ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు SIR (ఓటరు జాబితా సవరణ), రైతుల సమస్యలు వంటి కీలక అంశాలపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






