RBI Governor : ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆర్బీఐ గవర్నర్

by Muthe.Rajitha |

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(RBI Governor ShaktiKanth Das) ఆసుపత్రి నుంచి కొద్దిసేపటి క్రితం డిశ్చార్జ్ అయ్యారు.

RBI Governor : ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆర్బీఐ గవర్నర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(RBI Governor ShaktiKanth Das) ఆసుపత్రి నుంచి కొద్దిసేపటి క్రితం డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం అర్థరాత్రి ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో చెన్నై(Chennai)లోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం స్వల్ప ఎసిడిటీ సమస్య తప్ప.. మిగతా ఎలాంటి సమస్యలు లేవని మంగళవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో వైద్యబృందం వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. కాగా ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న శక్తికాంత్ దాస్ పదవీకాలం డిసెంబర్ 10తో ముగియనుంది.

Next Story