- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI : రైతులకు ఆర్బీఐ(RBI) శుభవార్త
రైతులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) శుభవార్త అందించింది. రైతులు తీసుకునే వ్యవసాయ రుణాల పరిమితిని రూ.2 లక్షలకు పెంచుతున్నట్లుగా వెల్లడించింది.

దిశ, వెబ్ డెస్క్ : రైతులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) శుభవార్త అందించింది. రైతులు తీసుకునే వ్యవసాయ రుణాల పరిమితి(Increase in agricultural loan limit)ని రూ.2 లక్షలకు పెంచుతున్నట్లుగా వెల్లడించింది. ఎలాంటి తనఖా లేకుండా రైతులు తీసుకునే వ్యవసాయ రుణాల పరిమితిని రూ.1.6 లక్షల నుంచి రూ.2లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ (Shaktikanta Das)వెల్లడించారు. పెట్టుబడి ఖర్చులు, ద్రవ్యోల్బణం, ఇతర అంశాల ఆధారంగా రుణపరిమితిని సవరించినట్లు చెప్పారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తమ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ఇవాళ వెల్లడించారు. ఆర్బీఐ వడ్డీ రేట్ల (Repo Rate) విషయంలోనూ కీలక ప్రకటన చేసింది. ఈసారి కూడా కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచుతున్నట్లు స్పష్టం చేసింది. వరుసగా 11వ సారి కూడా రెపో రేటు (Repo Rate)ను 6.5 శాతంగానే ఫిక్స్ చేసింది. ద్రవ్యోల్పణం, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి కూడా వడ్డీరేట్లలో మార్పులు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.






