కేరళ డీజీపీగా తెలుగు వ్యక్తి..

by Gantepaka Srikanth |

కేరళ(Kerala) కొత్త డీజీపీ(DGP)గా రావాడ చంద్రశేఖర్‌ నియామకం అయ్యారు. మంగళశారం ఆయన బాధ్యతల స్వీకరించనున్నారు.

కేరళ డీజీపీగా తెలుగు వ్యక్తి..
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ(Kerala) కొత్త డీజీపీ(DGP)గా రావాడ చంద్రశేఖర్‌ నియామకం అయ్యారు. మంగళశారం ఆయన బాధ్యతల స్వీకరించనున్నారు. చంద్రశేఖర్‌(Ravada Chandrasekhar)ది ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా. ప్రస్తుతం కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో స్పెషల్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్‌‌ను.. కేరళ డీజీపీగా నియమించారు. కేరళలోనే తలస్సేరి ASPగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. 15 సంవత్సరాలుగా IB డిప్యుటేషన్‌లో ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర డిప్యుటేషన్ నుండి వచ్చి కేరళ DGPగా నియమితులయ్యారు. డీజీపీ పోస్ట్‌ కోసం ఈయనతో పాటు మరో ఇద్దరు రేసులో ఉండగా కేబినెట్‌ చంద్రశేఖర్‌వైపే మొగ్గు చూపింది. కాగా డిప్యూటేషన్‌ నుంచి వచ్చిన తర్వాత కేరళ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా రవడ చంద్రశేఖర్ నిలిచారు.

Next Story