- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rath Yatra: పూరీలో జగన్నాథ రథయాత్ర ప్రారంభం.. భారీగా తరలివచ్చిన భక్తులు
ఒడిశాలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ఈ యాత్ర జగన్నాథ ఆలయం నుంచి గుండిచా టెంపుల్ వరకు సాగనుంది.

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath yatra) శుక్రవారం ప్రారంభమైంది. ఈ యాత్ర జగన్నాథ ఆలయం నుంచి గుండిచా టెంపుల్ వరకు సాగనుంది. 12 రోజుల పాటుఈ కార్యక్రమం జరగనుండగా మొదటి రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. ముందుగా బలభద్రుని రథాన్ని లాగారు. ఆ తర్వాత సుభద్ర, జగన్నాథుల రథాలను లాగారు. ఈ యాత్ర శనివారం గుండిచా ఆలయానికి చేరుకోనుంది. ఒడిశా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. దాదాపు పది వేల మంది కేంద్ర సాయుధ బలగాలను పూరీలో మోహరించారు. బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ శుక్రవారం పూరీలోని జగన్నాథ భక్తుల కోసం ప్రసాద సేవను ప్రారంభించింది.
శుక్రవారం పవిత్ర రథయాత్ర కోసం పూరీని సందర్శించే భక్తులు, యాత్రికులకు సీఎం మోహన్ చరణ్ మాఝి (Mohan Charan Majhi) శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పురోగతి, శ్రేయస్సు కోసం జగన్నాథుని ఆశీస్సులు ఉండాలని కోరారు. క్రమశిక్షణ, భక్తితో పండుగలో పాల్గొనాలని జగన్నాథ భక్తులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోని దిఘాలో కొత్తగా ప్రారంభించబడిన జగన్నాథ ఆలయంలోనూ ఈ తరహా వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడ తొలిసారిగా రథయాత్ర జరుగుతోంది.






