వినియోగదారులకు షాకిచ్చిన రాపిడో.. అలా చిక్కుకుంటే ఛార్జీల మోతే

by Naga Rani Yarlagadda |

ఉబర్ (Uber), ఓలా (Ola)లను తలదన్నేలా వచ్చిన ప్రముఖ రైడ్ హెయిలింగ్ యాప్ రాపిడో (Rapido) వినియోగదారులకు ఊహించని షాకిచ్చింది.

వినియోగదారులకు షాకిచ్చిన రాపిడో.. అలా చిక్కుకుంటే ఛార్జీల మోతే
X

దిశ, వెబ్‌డెస్క్: ఉబర్ (Uber), ఓలా (Ola)లను తలదన్నేలా వచ్చిన ప్రముఖ రైడ్ హెయిలింగ్ యాప్ రాపిడో (Rapido) వినియోగదారులకు ఊహించని షాకిచ్చింది. కొత్తగా ఒక ఛార్జింగ్ వ్యవస్థను ప్రవేశపట్టింది. రైడ్ సమయంలో భారీ ట్రాఫిక్ లో చిక్కుకుంటే దానికి కూడా ఛార్జీలు వసూలు చేయనుంది. 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం ట్రాఫిక్ (Rapido Traffic Charges) ఆలస్యమైతే నిమిషానికి 0.50 పైసలు ఛార్జీలు వడ్డించనుంది. కాగా.. దీని గరిష్ట పరిమితి రూ.30గా నిర్ణయించింది.

రాపిడో తీసుకున్న ఈ నిర్ణయంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ అనేది తాము నియంత్రించే విషయం కాదని, అందుకు తామెందుకు ఛార్జీలు చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రూ.40 టిప్ చెల్లించామని, ట్రాఫిక్ కారణంగా అదనంగా ఛార్జీలు వేయడం నిలువెత్తు దోపిడీలా కనిపిస్తోందని వాపోతున్నారు. మరి దీనిపై రాపిడో వివరణ ఇస్తుందో లేదో చూడాలి.

Next Story