ఢిల్లీలో చకచకా మారుతున్న పరిణామాలు.. కాసేపట్లో లోక్‌సభలో డీలిమిటేషన్‌పై ఓటింగ్

by Kema Shiva Kumar |

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డెలిమిటేషన్ బిల్లుపై ఓటింగ్‌కు రంగం సిద్ధమైంది.

ఢిల్లీలో చకచకా మారుతున్న పరిణామాలు.. కాసేపట్లో లోక్‌సభలో డీలిమిటేషన్‌పై ఓటింగ్
X

దిశ, వెబ్‌‌డెస్క్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ఇవాళ లోక్‌సభలో అత్యంత కీలక ఘట్టం చోటుచేసుకోబోతోంది. నియోజకవర్గాల పునర్విభజన (Delimitaion) బిల్లుపై ఓటింగ్ జరగనుండటంతో దేశ రాజధానిలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఓటింగ్‌కు ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య చదరంగం తలపించేలా వ్యూహప్రతివ్యూహాలు నడుస్తున్నాయి.

అమిత్ షా కార్యాలయంలో హైలెవల్ మీటింగ్

ఓటింగ్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) రంగంలోకి దిగారు. తన కార్యాలయంలో సీనియర్ మంత్రులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఎన్డీయే పక్షాల సభ్యులందరూ సభకు హాజరయ్యేలా చూడటం మరియు బిల్లుపై తలెత్తే చివరి నిమిషం అభ్యంతరాలను ఎలా ఎదుర్కోవాలో ఈ సమావేశంలో చర్చించారు.

విపక్షాల వ్యూహం - స్పీకర్‌తో భేటీ

మరోవైపు విపక్ష ‘ఇండి’ (INDIA) కూటమి ఈ బిల్లును అడ్డుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), కేసీ వేణుగోపాల్ (KC Venugopal) అనూహ్యంగా లోక్‌సభ స్పీకర్‌తో సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం విపక్ష కూటమి నేతలందరూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏ రూపంలో వచ్చినా డీలిమిటేషన్ బిల్లును ఓడిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఒక్కో సభ్యుడు ఉన్న చిన్న పార్టీలను కూడా కలిసి తమ వైపు తిప్పుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఇక సభలో ప్రతిష్టంభనను తొలగించేందుకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) విపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పర్యావర, ఇతర సాంకేతిక అంశాల కంటే దేశ రాజకీయ భవిష్యత్తుకు ఈ బిల్లు కీలకమని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ చారిత్రక బిల్లుకు మద్దతు ఇవ్వాలని సభ్యులందరికీ ప్రధాని మోదీ స్వయంగా విజ్ఞప్తి చేశారు.

Next Story