- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థినిపై అత్యాచారం.. ఇద్దరు అధ్యాపకుల అరెస్టు
కర్ణాటక రాజధాని బెంగళూరులో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి కేసు తీవ్ర కలకలం రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక రాజధాని బెంగళూరులో (Bangalore) విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి కేసు తీవ్ర కలకలం రేపుతోంది. నమ్మిన గురువులే రాక్షసుల్లా మారిన ఈ ఘటన రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన విద్యార్థినిపై అక్కడే బోధించే ముగ్గురు అధ్యాపకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మొదట ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర విద్యార్థినితో సన్నిహితంగా మెలిగి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ వీడియోలు తన వద్ద ఉన్నాయంటూ బయాలజీ లెక్చరర్ సందీప్ బెదిరించి విద్యార్థినిపై అత్యాచారం చేశాడు.
తరువాత అనూప్ అనే మరో అధ్యాపకుడు తన రూమ్‌లో విద్యార్థినితో జరిగిన ఘటన వీడియోలు తన వద్ద ఉన్నాయని ఆమెపై లైంగిక దాడికి దిగాడు. ఈ క్రూరకాండపై బాధిత విద్యార్థిని ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో తీవ్రంగా స్పందించిన పోలీసులు నిందితులైన ముగ్గురు అధ్యాపకులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిని రిమాండ్‌కు తరలించి విచారణ చేపట్టారు.
ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనతో విద్యా సంస్థల్లో భద్రతపై కొత్తగా చర్చ మొదలైంది.






