సీఎం పదవికి రంగస్వామి రాజీనామా.. అసెంబ్లీని రద్దు చేయాలని ఎల్‌జీకి విజ్ఞప్తి

by Kema Shiva Kumar |

పుదుచ్చేరిలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నది.

సీఎం పదవికి రంగస్వామి రాజీనామా.. అసెంబ్లీని రద్దు చేయాలని ఎల్‌జీకి విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి (N Ranga Swamy) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను మధ్యాహ్నం లెఫ్టినెంట్ గవర్నర్ కె.కైలాసనాథన్‌ (K.Kailasanathan)‌ను కలిసి స్వయంగా అందజేశారు. రాజీనామాతో పాటు ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేయాలని ఆయన లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరారు.

అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమి 18 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. ఇండియా కూటమి 6 స్థానాలకు, ఇతరులు 6 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ రావడంతో మరో రెండు మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి కూటమికి అధికారిక ఆహ్వానం అందనుంది. ప్రస్తుతానికి ఎన్.రంగస్వామి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉంది. త్వరలోనే ఎన్డీఏ కూటమి తమ కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనుంది.

Next Story