- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rana: త్వరలోనే భారత్‌కు తహవూర్ రాణా.. ఆయన పిటిషన్‌ను తిరస్కరించిన యూఎస్ సుప్రీంకోర్టు !
తహవూర్ రాణాకు మరో షాక్ తగిలింది. భారత్‌కు అప్పగించడంపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది.

దిశ, నేషనల్ బ్యూరో: 26/11 ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణా (Tahawwur Rana) కు మరో షాక్ తగిలింది. తనకు భారత్‌కు అప్పగించడంపై స్టే విధించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు (America supreme court) తిరస్కరించింది. దీంతో రాణా భారత్‌కు రావడానికి మార్గం సుగమం అయింది. త్వరలోనే అమెరికా ఆయనను భారత్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా గతంలో ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యూఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నానని, తనను భారతదేశానికి అప్పగిస్తే హింసించే అవకాశం ఉందని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తహవూర్ అభ్యర్థనను తోసి పుచ్చింది. గతంలోనూ పిటిషన్‌ను తోసిపుచ్చగా ఆయన రివ్యూ పిటిషన్ వేశారు.
కాగా, ముంబై ఉగ్రదాడుల్లో తహవూర్ కీలక సూత్రధారిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన లాస్ ఏంజెలెస్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఉగ్రవాదిని తమకు అప్పగించాలని కోరుతూ భారత ప్రభుత్వం చాలా ఏళ్లుగా పోరాటం చేస్తోంది. తాజాగా తహవూర్ భారత్‌కు రావడానికి మార్గం సుగమం అయింది. అయితే రాణాను విచారణ నిమిత్తం భారత్‌కు తీసుకురావడానికి తమ బృందం అమెరికాకు వెళ్లే తేదీలను అధికారులు త్వరలో తెలియజేస్తారని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారి ఒకరు తెలిపారు.






