- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విదేశీ మీడియాపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఫైర్
ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదంపై విదేశీ మీడియా చేస్తున్న ప్రసారాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదంపై విదేశీ మీడియా చేస్తున్న ప్రసారాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.పాశ్చత్య దేశాల మీడియా వివాదాస్పద, ఊహాగానాలతో కూడిన కవరేజీ ఇస్తోందని మండిపడ్డారు. ప్రమాదంపై తుది నివేదిక వెలువడే వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
గతంలో బ్లాక్ బాక్స్ దెబ్బతిన్న సందర్భాల్లో డేటాను పొందేందుకు విదేశాలకు పంపేవారని, కానీ ఈసారి ఏఏఐబీ భారత్‌లోనే దీన్ని సాధించడం గొప్ప విజయం అన్నారు. ప్రాథమిక నివేదిక కూడా సిద్ధమైందని ఫైనల్ రిపోర్ట్ వచ్చేవరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పశ్చిమ దేశాల మీడియా ముఖ్యంగా వాల్ స్ట్రీట్ జర్నల్ మరియు రాయిటర్స్ లాంటి సంస్థలు పైలట్లపై నిందలు వేస్తూ, ఆధారాలు లేని కథనాలు ప్రచురిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ మీడియా సంస్థలను వాటి స్వప్రయోజనాల కోసం ఇలాంటి కథనాలు ప్రచురించకుండా ఉండాలని ఏఏఐబీ కోరింది.






