- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Plane Crash : విమానం మంటల్లోంచి తాపీగా నడుచుకుంటూ వచ్చిన రమేష్ విశ్వాస్... మృత్యుంజయుని మరో వీడియో వైరల్
ఇటీవల జరిగిన అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) గురించి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల జరిగిన అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) గురించి తెలిసిందే. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు సిబ్బంది సహ 242 మంది ఉండగా.. ఒకే ఒక్కడు మృత్యుంజయుడిగా బయట పడ్డాడు. విమానంలో ఎగ్జిట్ సీట్లో కూర్చున్న రమేష్ విశ్వాస్ కుమార్(Ramesh Kumar Vishwas) తప్ప మిగతా అంతా ప్రమాదంలో దారుణంగా కాలిపోయారు. కాగా అనూహ్యరీతిలో ప్రమాదం నుంచి బయట పడ్డ అనంతరం రమేష్.. విమాన మంటల నుంచి తాపీగా నడుచుకుంటూ బయటికి వచ్చి అంబులెన్స్ ఎక్కిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
కాగా విమానం మెడికల్ కాలేజీ మీద పడి భారీగా మంటలు అంటుకోగానే స్థానికులు ఒక్కసారిగా భయానికి గురయ్యారు. వారంతా ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండగానే తెలుపు రంగు టీ షర్ట్ ధరించిన వ్యక్తి చేతిలో ఫోన్ తో మంటల నుంచి బయటికి వచ్చాడు. అతని ఒంటి మీద గాయాలు ఉండటంతో అతన్ని వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆ ప్రమాదంలో బతికి బయట పడింది అతను ఒక్కడేనని తేలింది. లండన్ నివాసి అయిన రమేష్ కుమార్ విశ్వాస్.. తన కుటుంబాన్ని కలిసేందుకు వచ్చి, తిరిగు ప్రయాణంలో తన సోదారునితో తిరిగి లండన్ వెళ్తుండగా ఈ విమాన ప్రమాదం జరిగింది.
తాను 11-ఏ సీటులో కూర్చున్నానని, విమానం కూలగానే తన సీటు విరిగి కింద పడటంతో తనకు మంటలు అంటుకోలేదని రమేష్ మీడియాకు తెలిపాడు. కళ్ళు తెరిచి చూసేసరికి భవనం శిథిలాల్లో ఉన్నానని, అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ బయటికి వచ్చానని పేర్కొన్నాడు.






