ఘోర విమాన ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ రమేశ్.. సోదరుడి పాడే మోస్తూ ఎమోషనల్!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-18 12:34:57  IST  )

అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం మొత్తం దేశాన్నే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే.

ఘోర విమాన ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ రమేశ్.. సోదరుడి పాడే మోస్తూ ఎమోషనల్!
X

దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం (Ahmedabad plane crash) మొత్తం దేశాన్నే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన నుంచి మృత్యుంజయుడిగా బయటపడిన ఏకైక వ్యక్తిగా డయ్యూకు చెందిన రమేశ్ విశ్వాస్ కుమార్ నిలిచాడు. విమానం కూలిన సమయంలో రమేశ్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం మంగళవారం రాత్రి డిశ్చార్జ్‌ అయ్యాడు. కానీ తాను బతికిన ఆనందం కంటే.. తనతో కలిసి అదే విమానంలో ప్రయాణించిన సోదరుడు అజయ్‌ మరణించిన వార్త అతడి మనసును తల్లడిల్లేలా చేసింది.

డీఎన్‌ఏ పరీక్షలు పూర్తయిన అనంతరం అధికారులు అజయ్‌ పార్థివదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. బుధవారం ఉదయం (జూన్ 18) డయ్యూలో అజయ్‌ అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల్లో రమేశ్‌ స్వయంగా తన సోదరుడి పాడె మోసిన క్షణాలు హృదయాన్ని తాకేలా మారాయి. అతని పార్థివదేహాన్ని చూసి రమేశ్‌ కన్నీరు ఆపలేకపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ సోదరుని ప్రాణాలు కాపాడిన దైవం.. మరోవైపు మరో సోదరుడి ప్రాణం తీసుకోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. యూకే నుంచి వచ్చి, కుటుంబంతో గడిపిన తీపి క్షణాలు.. ఆఖరికి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. తిరిగి లండన్‌కు వెళ్లేందుకు విమానం ఎక్కగా.. ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Next Story