- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేజ్రివాల్‌వి తప్పదోవ పట్టించే వ్యాఖ్యలు : రమేష్ బిదూరి
కేజ్రివాల్‌తో పాటు ఆప్ నాయకులు తన విషయంలో అబద్దాలు ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. నేను ఏ పోస్టును కూడా ఆశించడం లేదుని బిదూరి స్పష్టం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ ఆప్ జాతీయ కన్వీనర్ చేసిన వ్యాఖ్యలు తప్పదోవ పట్టించేలా ఉన్నాయని బీజేపీ మాజీ ఎంపీ, కాల్కాజీ సెగ్మెంట్ అభ్యర్థి రమేష్ బిదూరి అన్నారు. తాను బీజేపీకి నమ్మకమైన కార్యకర్తనని, పార్టీ నుంచి ఏ పోస్టును కూడా ఆశించడం లేదని బిదూరి స్పష్టం చేశారు. కేజ్రివాల్‌తో పాటు ఆప్ నాయకులు తన విషయంలో అబద్దాలు ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. నేను ఏ పోస్టును కూడా ఆశించడం లేదుని బిదూరి స్పష్టం చేశారు. తాను సీఎం అవుతానని కేజ్రివాల్ చెప్పడం ద్వారా ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పరోక్షంగా అంగీకరించినట్లు అయ్యిందని బిదూరి చెప్పారు. ఢిల్లీ ప్రజలు ఆప్‌పై ఆగ్రహంతో ఉన్నారనే విషయాన్ని కేజ్రివాల్ గ్రహించారు. లిక్కస్ స్మామ్, ఎడ్యుకేషన్ స్కామ్, హెల్త్ స్కామ్, శీష్‌మహల్ స్కామ్ వంటి వాటితో ప్రజలు విసిగిపోయారు. కనీసం రోడ్లను బాగుచేయలేదు, సరైన నీటిని సరఫరా చేయలేదని బిదూరి ఆరోపించారు. ఆప్ నాయకుల మాటల వలలో పడొద్దని బిదూరి ఢిల్లీ ప్రజలను అభ్యర్థించారు.






