Ramayana In Parliament : పార్లమెంటులో రామాయణం సినిమా ప్రదర్శన!

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-02 12:34:53  IST  )

భారత పార్లమెంటు(Parliament) ఓ అరుదైన సందర్భానికి వేదిక కానుంది. రామాయణం భారత దేశం అత్యున్నత ఇతిహాస కావ్యంగా భావిస్తారు. మర్యాద పురుషోత్తముడిగా రాముడి ఆదర్శ జీవితంతో కూడిన రామాయణం దేశ వాసులకు సుపరిచితమే.

Ramayana In Parliament : పార్లమెంటులో రామాయణం సినిమా ప్రదర్శన!
X

దిశ, వెబ్ డెస్క్: భారత పార్లమెంటు(Parliament) ఓ అరుదైన సందర్భానికి వేదిక కానుంది. రామాయణం భారత దేశం అత్యున్నత ఇతిహాస కావ్యంగా భావిస్తారు. మర్యాద పురుషోత్తముడిగా రాముడి ఆదర్శ జీవితంతో కూడిన రామాయణం దేశ వాసులకు సుపరిచితమే. దేశ సంస్కృతిలో రామాయణం ఓ జీవన విధానంగా ముడిపడింది. రాముడి గుడి లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. అంతటి విశిష్టమైన రామాయణం కథతో రూపొందించిన ' రామాయణం : ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ రామా' (Ramayana The Legend of Prince Rama)యానిమేటెడ్ సినిమాను ఈ నెల 15న పార్లమెంటులో ప్రదర్శించనున్నా(Presented In Parliament)రు. గీక్ పిక్చర్స్ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించింది. పార్లమెంటులో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా గీక్ పిక్చర్స్ ఇండియా సహ వ్యవస్థాపకులు అర్జున్ అగర్వాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. 'రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' చిత్రాన్ని ఫిబ్రవరి 15న పార్లమెంటులో ప్రదర్శించనున్నామని.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సహా పార్లమెంటు సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు సైతం దీనికి హాజరుకానున్నారని తెలిపారు. ఈ ప్రదర్శన మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది' అని పేర్కొన్నారు.

వాల్మీకి రామాయణం గురించి అనేక సినిమాలు వచ్చాయి. కానీ 31 ఏళ్ల క్రితం జపాన్ వాళ్లు ఇండియన్ టీమ్ తో కలిసి రామాయణాన్ని యానిమేషన్ రూపంలో తెరకెక్కించారు. 1993లో 'రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' యానిమేటెడ్ చిత్రాన్ని రూపొందించారు. 24వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో దీన్ని ప్రదర్శించారు. అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడు థియేటర్లలో ప్రదర్శించలేకపోయారు. 2000 సంవత్సరంలో టీవీలో దీన్ని ప్రసారం చేయగా అద్భుత ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. దీంతో దీని 4కే వెర్షన్ ను సిద్ధం చేసి జనవరి 10న రిలీజ్ చేశారు. గీక్ పిక్చర్స్ ఇండియా, ఏఏ ఫిల్మ్స్ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. రామ్ మోహన్, యుగో సాకో దర్శకత్వం వహించిన ఈ యానిమేటెడ్ చిత్రానికి విజయేంద్రప్రసాద్ రైటర్ గా వర్క్ చేశారు.

'రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా' యానిమేషన్ చిత్రంలో రాముడి జననం గురించి మొదట వాయిస్ ఓవర్లో చెప్పి, ఆయనకు 15 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి కథను, ప్రారంభించారు. రామ లక్ష్మణులు తాటకిని చంపి ఋషులను కాపాడటం మొదలు... సీతా పరిణయం, అరణ్యవాసంలో సీతారామ లక్ష్మణుల వనవాసం, సీతాపహారణం, రామ, రావణల యుద్ధం వరకు ఈ చిత్రంలో చూపించారు. టెక్నాలజీని ఉపయోగించి కార్టున్ వర్క్ పరంగా.. క్వాలిటీ పరంగా ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాను అద్భుతంగా తీర్చి దిద్దారు. రాముడి ఎంట్రీతో పాటు హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషన్స్ అదిరిపోతాయి. యానిమేషన్ చిత్రమే అయినా నిజంగా కథ జరుగుతున్నంత సేపు ఎమోషన్ ని పండించగలిగారు. చిన్న పిల్లలు ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుందని.. సినిమాటోగ్రఫీ, మోషన్ పిక్చర్ క్యాప్చర్ బాగుందని..అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా సినిమాకు పాజిటివిగా మారిందని ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమా కోసం సుమారుగా 450 మంది ఆర్టిస్టులు పనిచేయగా.. సుమారుగా 1 లక్షలకు పైగా హ్యాండ్ డ్రాయింగ్స్ ను చిత్రించారు. తెలుగు వర్షన్ కూడా విడుదల చేశారు.

Next Story