BJP-RSS: బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య విభేదాలపై రామ్ మాధవ్ క్లారిటీ

by Prasad Jukanti |

ఆర్ఎస్ఎస్-బీజేపీ మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న వేళ రామ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

BJP-RSS: బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య విభేదాలపై రామ్ మాధవ్ క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ పై ప్రశంసలు కురిపించడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. గత కొంత కాలంగా బీజేపీకి ఆర్ఎస్ఎస్ కు (BJP-RSS) మధ్య గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎర్రకోట ప్రసంగంలో మోడీ నోట ఆర్ఎస్ఎస్ మాట వినిపించడం హాట్ టాపిక్ గా మారింది. సంఘ్ పెద్దలను మచ్చిక చేసుకోవడం కోసమే ప్రధాని మోడీ ఈ తంటాలు పడుతున్నారని కాంగ్రెస్ విమర్శించింది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్-బీజేపీ మధ్య విభేదాలపై ఆర్ఎస్ఎస్ నీనియర్ నేత రామ్ మాధవ్ (Ram Madhav) క్లారిటీ ఇచ్చారు. ఓ న్యూస్ ఎజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఆర్ఎస్ఎస్, బీజేపీ రెండు సంస్థలు అయినప్పటికీ ఒకే సిద్ధాంత కుటుంబానికి చెందినవే అన్నారు. బీజేపీ రాజకీయ రంగంలో పని చేస్తుంటే.. ఆర్ఎస్ఎస్ సమాజ సేవలో ఉందని ఉందన్నారు. ఈ రెండింటి మధ్య ఎటువంటి విభేదాలు లేవనన్నారు. బీజేపీపై మాట్లాడేందుకు ఏమి లేనప్పడు ప్రత్యర్థులు ఇలాంటి విమర్శలే చేస్తారని వ్యాఖ్యానించారు. ట్రంప్ సుంకాలపై స్పందించిన రామ్ మాధవ్ అమెరికా-భారత్ సంబంధాలు ప్రస్తుతం కీలక దశలో ఉన్నాయన్నారు. ఎత్తుపల్లాలు ఉంటాయి. కానీ ఈ దశను మనం అధిగమిస్తామని నాకు నమ్మకం ఉందన్నారు. భారత్, అమెరికా రెండు ప్రజాస్వామ్య దేశాలేనని ఈ రెండు దేశాలు కలిసి పని చేయాల్సిందేనన్నారు.

Next Story