- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rajyasabha: ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
భారతదేశంలో విదేశీయుల వలస, ప్రవేశం, బసను నియంత్రించే ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ బిల్లు- 2025కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశంలో విదేశీయుల వలస, ప్రవేశం, బసను నియంత్రించే ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ బిల్లు- 2025 (Immigration and Foreigners Bill) కు పార్లమెంట్ (Parliament) ఆమోదం తెలిపింది. ఈ బిల్లును గత నెల 27న లోక్ సభ ఆమోదించగా బుధవారం రాజ్యసభ(Rajyasabha)లో ఆమోదం పొందింది. మూజువాణి ఓటు ద్వారా ఎగువసభ బిల్లును ఆమోదించింది. ఈ చట్టం ఫారెనర్స్ యాక్ట్-1946, పాస్ పోర్ట్ యాక్ట్- 1920, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారెనర్స్ యాక్ట్-1939, ఇమ్మిగ్రేషన్ యాక్ట్- 2000 చట్టాలను భర్తీ చేస్తుంది. హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ (Nithyananda Roy) బిల్లుపై చర్చ సందర్భంగా సమాధానమిస్తూ పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై మండిపడ్డారు. అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించడానికి టీఎంసీ సహాయం చేస్తోందని ఆరోపించారు. ఓటర్ల జాబితా, రేషన్ కార్డుల్లో వారి పేర్లను చేర్చడం ద్వారా ఇక్కడ నివసించడం సులభతరం చేస్తోందని ఫైర్ అయ్యారు.
విశ్వవిద్యాలయాలు, విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకురావడానికి ఈ బిల్లును తీసుకురావడం ఎంతో అవసరమని తెలిపారు. మూడేళ్ల అధ్యయనం తర్వాత ఈ బిల్లును తీసుకొచ్చామన్నారు. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత, భారతదేశానికి వచ్చే విదేశీలయులపై పూర్తి పర్యవేక్షణ ఉంటుంది. ఈ బిల్లులోని సెక్షన్ 3 ప్రకారం ఎవరైనా వ్యక్తి జాతీయ భద్రత, సార్వభౌమాధికారం, దేశ సమగ్రతకు ముప్పు కలిగించే ప్రమాదం ఉన్నట్టైతే వారిని దేశంలోకి అనుమతించదు. అంతేగాక ఫారెనర్స్ ఇండియాకు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తుంది. అలాగే విద్యాసంస్థలు, ఆస్పత్రులు, విదేశీ పౌరులకు సంబంధించిన వివరాలు తమ వద్ద ఉంటే ఇమ్మిగ్రేషన్ అధికారులకు తప్పనిసరిగా తెలియజేయాలి. ఈ రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలు సైతం విధించనున్నారు.






