- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rajya sabha: రాజ్యసభ నుంచి ప్రతిపక్షాల వాకౌట్.. డూప్లికేట్ ఓటర్ ఐడీపై చర్చకు అనుమతివ్వకపోవడంతో ఆగ్రహం
హోలీ పండుగ కారణంగా నాలుగు రోజుల విరామం అనంతరం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి.

దిశ, నేషనల్ బ్యూరో: హోలీ పండుగ కారణంగా నాలుగు రోజుల విరామం అనంతరం పార్లమెంట్ (Parliament) బడ్జెట్ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు చెందిన 10 మంది ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. సభా కార్యకలాపాలను నిలిపివేసి, నకిలీ ఓటరు ఐడీలపై చర్చ చేపట్టాలని వారంతా డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్లమెంట్ నిబంధన 267 కింద నోటీసులు ఇచ్చారు. కానీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ (Harivamsh) దీనిని తిరస్కరించారు. నోటీసులను అనుమతించలేమని, చర్చ కుదరదని స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్ష ఎంపీలు మొదట సభలో నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ హరివంశ్ వారి నోటీసులను పరిగణనలోకి తీసుకోకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు.
టీఎంసీ, కాంగ్రెస్ ఎంపీలు నకిలీ ఓటరు ఐడీ కార్డుల సమస్యను లేవనెత్తాలని ప్రయత్నించగా, తమిళ పార్టీలు దక్షిణాది రాష్ట్రాలపై తదుపరి డీలిమిటేషన్ (Delimitation) ప్రభావంపై చర్చించాలని పట్టుబట్టాయి. రాష్ట్రాల అంతటా నకిలీ ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో గుర్తింపు కార్డులను జారీ చేయడంలో ఎన్నికల సంఘం వైఫల్యంపై చర్చ జరగాలని ఎంపీలు సుఖేందు శేఖర్ రాయ్, మౌసమ్ బినూ, సుష్మితా దేవ్, ప్రమోద్ తివారీలు డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ ఆందోళనలపైనా చర్చ చేపట్టాలని డీఎంకెకు చెందిన విల్సన్, సీపీఎంకు చెందిన శివదాసన్‌లు పట్టుబట్టారు. మరోవైపు ఢిల్లీలో పెరుగుతున్న నేరాలు, క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితిపై చర్చ చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు.
నీట్ పేపర్ లీక్‌పై కాంగ్రెస్ వాయిదా తీర్మానం
నీట్ పేపర్ లీక్‌తో సహా ఇతర ఎగ్జామ్ పేపర్ లీక్‌లపై చర్చించాలని, దానిని నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ (Manikam tagore) లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై కూడా చర్చకు అనుమతివ్వలేదు. మరోవైపు అనారోగ్యం కారణంగా సభా కార్యకలాపాలకు దూరంగా ఉన్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ సోమవారం సభకు హాజరయ్యారు. కాసేపు కార్యకలాపాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యంపై సోనియా, మమత సహా పలువురు ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. ఇది తనను ఎంతో భావోద్వేగానికి గురి చేసిందని నొక్కి చెప్పారు.
Read More..






